News July 23, 2024

లభ్యంకాని నరసాపురం MPDO ఆచూకీ

image

నరసాపురం ఎంపీడీవో అదృశ్యమై ఎనిమిది రోజులు దాటినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఫలించడం లేదు. ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇంకా జీవించే ఉన్నారా? అనే దానిపై స్పష్టత రానట్లు తెలుస్తోంది. . సోమవారం కూడా ఏలూరు కాలువను పూర్తిగా గాలించినట్లు పోలీసులు తెలిపారు.  ఈ నేపథ్యంలో జీవించి ఉండవచ్చనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.

Similar News

News October 31, 2025

తుఫాను తాకిడికి 91 గ్రామాలు ప్రభావితం: కలెక్టర్

image

తుఫాను కారణంగా జిల్లాలో జరిగిన ప్రాథమిక నష్టం అంచనాలను కలెక్టర్ నాగరాణి గురువారం వివరించారు. ఈ తుఫాను తాకిడికి 91 గ్రామాలు ప్రభావితం అయ్యాయని, 13 గ్రామాలు, 6 పట్టణాలు నీట మునిగాయని తెలిపారు. మొత్తం 13,431.83 హెక్టార్లలో వ్యవసాయం, 299.87 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 93 ఇళ్లు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు.

News October 30, 2025

నరసాపురం: చెరువులో పడి దివ్యాంగుడి మృతి

image

నరసాపురం మండలం లిఖితపూడి గ్రామానికి చెందిన దివ్యాంగుడు పెచ్చేట్టి సుబ్బారావు (75) గురువారం ముఖం కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలించగా, సాయంత్రం చెరువులో సుబ్బారావు మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News October 30, 2025

తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వెయ్యాలి: కలెక్టర్

image

తుఫాను కారణంగా జరిగిన ప్రతి నష్టాన్ని అంచనా వెయ్యాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు గురువారం ఆమె కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగుదలకు పత్యేక శ్రద్ధ పెట్టాలి, తాగునీరు సమస్య లేకుండా చూడాలన్నారు. అనంతరం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.