News March 25, 2024
లవ్ మ్యారేజ్.. మరో ఎఫైర్ పెట్టుకొని భార్యకు వేధింపులు
భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తపై ఉండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉండికి చెందిన సూరిబాబు, జ్యోతి 2011లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా చెడు వ్యసనాలకు బానిసైన సూరిబాబు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని భార్య ఆదివారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 14, 2024
ఏలూరు: ముగిసిన వైసీపీ నేత అంత్యక్రియలు
కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మేడవరపు అశోక్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయానికి పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో వేలాది సంఖ్యలో ఆయన అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.
News September 14, 2024
భీమవరంలో తల్లిదండ్రులను మోసం చేసిన కొడుకు
తమ కొడుకే తమను మోసం చేశాడని భీమవరం నాచువారి సెంటర్‌కు చెందిన డోకల నాగన్న- అప్పాయమ్మ దంపతులు వాపోతున్నారు. బాధితుల వివరాల ప్రకారం.. సెంటర్లో తమకు ఉన్న సెంటున్నర స్థలంలో చిన్నపాక వేసుకుని పింఛన్ నగదుతో జీవనం సాగిస్తున్నారు. కాగా ఆ స్థలాన్ని వారి చిన్న కొడుకు సోమేశ్వరరావు బలవంతంగా రాయించుకొని వేరే వ్యక్తులకు అమ్మేశాడు. దీంతో వారు ఖాళీ చేయించడంతో రోడ్డునపడ్డారు. అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు.
News September 14, 2024
ప.గో.: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి ఆరేళ్ల జైలు
ప.గో. జిల్లా ఆకివీడుకు చెందిన 12 ఏళ్ల బాలికపై మాదివాడకు చెందిన మద్దా సుందర్ సింగ్ 2017లో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ముద్దాయికి న్యాయమూర్తి సోమశేఖర్ శుక్రవారం ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ప్రస్తుత ఎస్సై నాగరాజు తెలిపారు.