News March 20, 2024
లారీ-గోడకు మధ్య ఇరుక్కొని మహిళల మృతి

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం లలిత రైస్ ఇండస్ట్రీలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. లారీ వెనక్కి తీస్తుండగా క్యాబిన్కు-గోడకు మధ్య చిక్కుకొని కామేశ్వరి(60), నాగరత్నం(65) మృత్యువాత పడ్డారు. వర్షం వస్తోందని గోడ పక్కన నిలుచున్న వీరిని లారీ ఢీ కొట్టింది. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 7, 2026
జగన్తో తానేటి వనిత భేటీ.. చోడవరం ఫ్లెక్సీ వివాదంపై సుదీర్ఘ చర్చ!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానేటి వనిత మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా చోడవరం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఫ్లెక్సీల వివాదం, అనంతరం తలెత్తిన పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.
News January 7, 2026
రాజానగరం: తొలిసారిగా ‘నన్నయ వర్సిటీ’కి ఫైవ్ స్టార్ గౌరవం

ఉన్నత విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్’ సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా నన్నయ వర్సిటీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మంగళవారం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ సర్టిఫికెట్ను వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు.
News January 6, 2026
జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్గా సుబ్బారాయుడు

తూ.గో. జిల్లా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్గా బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు నియమితులయ్యారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడైన ఆయన, 2026 నుంచి 2029 వరకు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు రాజా, కార్యదర్శి శ్రీనివాస్ ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.


