News June 27, 2024
లావు నేతృత్వంలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ పార్లమెంటరీ నాయకుడిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురువారం ప్రకటించారు. పార్లమెంటరీ పార్టీ ఉప నాయకులుగా దగ్గుపాటి ప్రసాదరావు, బైరెడ్డి శబరి, కార్యదర్శిగా బికె. పార్థసారథి, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కార్యాలయ కార్యదర్శిగా నూపద సత్యనారాయణను ఎంపిక చేస్తూ ..చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 28, 2025
గుంటూరులో పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. మొత్తం 15 వినతులు స్వీకరించి, వ్యక్తిగత, సర్వీసు, బదిలీ, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం పోలీస్ శాఖకు ప్రాధాన్యం అని, భయపడకుండా సమస్యలను నేరుగా తెలియజేయాలని ఆయన సూచించారు.
News November 28, 2025
దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో శుక్రవారం నిర్వహించిన వేలంలో 140 బస్తాల పసుపు విక్రయాలు జరిగాయి. ఈ వేలంలో క్వింటాల్ పసుపు ధర రూ.12,900 పలికింది. కొమ్ముల రకం పసుపు కనిష్ఠ, గరిష్ఠ, మోడల్ ధరలు రూ.12,900గా ఒకే ధర పలకగా, కాయ రకం పసుపు కూడా అదే ధర పలికినట్లు యార్డు అధికారులు తెలిపారు.
News November 28, 2025
ఖేలో ఇండియా క్రీడల్లో ANU విద్యార్థికి మూడో స్థానం

రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) విద్యార్థి ఎం. అశోక్ కుమార్ శుక్రవారం మూడో స్థానం సాధించారు. వెయిట్ లిఫ్టింగ్ 94 కేజీల కేటగిరీలో ఆయన కాంస్యం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్‌ను వర్సిటీ వీసీ గంగాధరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.


