News November 11, 2024
లావేరు: విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా

లావేరు మండలంలోని భీమునిపాలెంలో అదపాక రహదారిపై సోమవారం సాయంత్రం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తామాడ మెడల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న కొత్తకోట గ్రామానికి చెందిన 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరికి కాళ్ళు, చేతులు విరిగిపోవడంతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులందరినీ స్థానికులు సహాయంతో 108లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News November 22, 2025
శ్రీకాకుళం నుంచి ప్రశాంతి నిలయానికి ప్రత్యేక రైలు

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) నుంచి ప్రశాంతి నిలయయానికి ప్రత్యేక రైలును శుక్రవారం శ్రీ సత్యసాయి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు ప్రారంభించారు. ప్రత్యేక ట్రైన్లో సుమారు 1,400 భక్తులతో ప్రయాణమైందని ఆయన తెలిపారు. ఈనెల 23వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వందల పుట్టినరోజు సందర్భంగా ఈ రైలును ఏర్పాటు చేశామన్నారు.
News November 22, 2025
శ్రీకాకుళం: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
News November 21, 2025
శ్రీకాకుళం: ‘టెన్త్ పరీక్షల రాసే విద్యార్థులకు గమనిక’

టెన్త్ పరీక్షలకు వయసు చాలని విద్యార్థుల కండోనేషన్ ఫీజుకు వివరాలను సరి చూసి చెల్లించాలని DEO రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31.08.2025 నాటికి 14 సంవత్సరాలు నిండని విద్యార్థుల https://ose.ap.gov.in వెబ్ సైట్లో వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజామాన్యం ఈ విషయాన్ని గమనించాలని, ఎటువంటి అపరాధ రుసుం లేకుండా టెన్త్ పరీక్షల ఫీజును నవంబర్ 30లోగా చెల్లించాలన్నారు.


