News March 29, 2024
లా కోర్స్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఎచ్చర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లో లా కోర్సు కు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. మూడేళ్ల ఎల్.ఎల్.బి,లో రెండో సెమిస్టర్, ఐదో సెమిస్టర్, ఐదేళ్ల కోర్సులో రెండో సెమిస్టర్, ఐదో సెమిస్టర్, తొమ్మిదో సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫలితాలలో జ్ఞానభూమి పోర్టల్ లో అందుబాటులో ఉంచామన్నారు.
Similar News
News February 8, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు

విద్యాశాఖ ఆదేశాల మేరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ఈనెల 9 తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని డీఈవో ఏ రవిబాబు తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం డీఈవో కార్యాలయంలో ఆయన ప్రకటన విడుదల చేస్తూ ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం, మధ్యాహ్నం కూడా పరీక్షలు కొనసాగుతాయని ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రాలు ఆయా హెచ్ఎంలకు అప్పగించామన్నారు.
News February 8, 2026
SKLM: ‘జిల్లా అభివృద్ధికి పన్నులు వసూళ్లు తప్పనిసరి’

జిల్లా అభివృద్ధికి కీలకమైన పన్నుల వసూళ్లు తప్పనిసరని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వాణిజ్య పన్నుల శాఖ సమన్వయ కమిటీ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొని అధికారులుతో మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెవిన్యూ పోలీస్ ఇంజనీరింగ్ వాణిజ్య పన్నులు శాఖ అధికారులు నిరంతరం సమాచారం పంచుకోవాలన్నారు.
News February 8, 2026
శ్రీకాకుళం: వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి

పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలలో 100% ఫలితాలను సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ని ఆయన ఆవిష్కరించారు.


