News February 26, 2025
లింగంపాలెం: ప్రమాదంలో డ్రైవర్ మృతి

లింగంపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ట్రాక్టర్ డ్రైవర్ రాత్రి సమయంలో ట్రాక్టర్ కింద నిద్రించాడు. పక్కనే ఉన్న లారీ డ్రైవర్ లారీ రివర్స్ చేసే క్రమంలో ట్రాక్టర్ ను ఢీకొనగా.. ట్రాక్టర్ ముందుకు జరిగింది. దీంతో ట్రాక్టర్ కింద పడుకున్న వ్యక్తి పై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC

AP: రాష్ట్రంలో 21 ఉద్యోగాలకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లైబ్రేరియన్ సైన్స్లో జూనియర్ లెక్చరర్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్)- 12+1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)- 3, హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి. రేపటి నుంచి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని APPSC తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News September 16, 2025
అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్షీట్ల దాఖలుకు అనుమతినిచ్చింది.
News September 16, 2025
మంజీరా నది ఉరకలేస్తుంది..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉద్ధృతి కారణంగా పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద మంజీర నది ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్ఫ్లో 62,542 క్యూసెక్కులుగా ఉంది.