News February 7, 2025
లింగంపాలెం: వ్యక్తి అనుమానాస్పద మృతి

లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో రామస్వామి (45) అనే వ్యక్తి గురువారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రామస్వామి చావుకి అదే గ్రామానికి చెందిన కొందరు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. లింగపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 15, 2025
బిడ్డకు పాలిస్తే క్యాన్సర్ నుంచి రక్షణ

తల్లిపాలివ్వడం బిడ్డకే కాదు తల్లికీ రక్షేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. దీనివల్ల మహిళల్లో ఎక్కువగా కనిపించే ట్రిపుల్ నెగెటివ్ అనే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. డెలివరీ తర్వాత వక్షోజాల్లో సీడీ8+టీ అనే వ్యాధినిరోధక కణాలు ఏర్పడతాయి. ఇవి శక్తిమంతమైన రక్షకభటుల్లా పనిచేస్తూ వక్షోజాల్లోని క్యాన్సర్ కణాలని ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
News November 15, 2025
ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛాంద్ర కార్యక్రమం

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమం జరిగింది. ఆలయ సిబ్బంది, అధికారులు పరిశుభ్రతపై ప్రమాణ స్వీకారం చేశారు. నూతన రాజగోపురం ప్రాంగణంలో ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ శీనా నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ధర్మకర్తల సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, శానిటేషన్, వైద్య, భద్రతా విభాగ సిబ్బంది పాల్గొన్నారు.
News November 15, 2025
మిర్యాలగూడలో వ్యభిచారంపై దాడి.. నలుగురు అరెస్ట్

మిర్యాలగూడలో వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు శుక్రవారం దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. ఎస్సై సైదిరెడ్డి వివరాల ప్రకారం.. రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న షేక్ ఫాతిమా, రెడ్డబోయిన సంధ్య వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. దాడి చేసి నిర్వాహకులతో పాటు ఒక మహిళ, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.


