News January 24, 2025
లింగంపేట్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లింగంపేట్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. SI సుధాకర్ వివరాలిలా.. లింగంపేట్‌కు చెందిన కాశిరాం(50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చూపించినా జబ్బు నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 27, 2025
ములుగు: పంచాయతీ ఎన్నికలకు 1,306 పోలింగ్ స్టేషన్లు

ములుగు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు 217 లొకేషన్లలో 1,306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 146 సర్పంచ్, 1,290 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు 1,880 మంది పీఓలు, 2,010 మంది ఓపీఓలను నియమించారు. 1,566 బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయ్యింది. సర్పంచ్ బరిలో 8మంది కంటే ఎక్కువ మంది ఉంటే అప్పటికప్పుడు ముద్రించేలా ప్రింటింగ్ ప్రెస్‌లను గుర్తించారు.
News November 27, 2025
ములుగు కలెక్టరేట్‌లో కొత్త విత్తన ముసాయిదాపై చర్చ

రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు, ఇతర వాటాదారుల నుంచి కొత్త విత్తన బిల్లు ముసాయిదాపై అభిప్రాయాలు సేకరించామని అదనపు కలెక్టర్ మహేందర్ జీ తెలిపారు. ఈరోజు ములుగులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విత్తనబిల్లు-2025లోని సెక్షన్లు, క్లాసులు, విత్తన చట్టం, 1966లోని లోపాలు, కొత్త విత్తన చట్టం లక్ష్యాలు వంటి ప్రతి అంశంపై చర్చించామన్నారు.
News November 27, 2025
విశాఖ: వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా యాంటీ రాబిస్ వ్యాక్సిన్‌ను గురువారం వేశారు. జీవీఎంసీ పరిధిలో 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బందికి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి వ్యాక్సిన్ వేశారు. వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు,శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని కమిషనర్ ఆదేశించారు.


