News October 20, 2024
లింగంపేట్: కానిస్టేబుల్కు అంటుకున్న మంటలు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో అడ్డుకోబోయిన కానిస్టేబుల్ రమేష్ రెడ్డికి మంటసెగ తాకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ రమేష్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అంతకుముందు ధర్నాలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Similar News
News October 29, 2025
బోధన్, ఆర్మూర్ పట్టణాలకు మాస్టర్ ప్లాన్

అమృత్ 2.0లో భాగంగా జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మొదటి కన్సల్టేటివ్ వర్క్షాప్ నిర్వహించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగుపరుస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని కలెక్టర్ వెల్లడించారు. అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
News October 28, 2025
CM రేవంత్, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు: MPఅర్వింద్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని MP అర్వింద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదని ఆరోపించారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
News October 28, 2025
NZB: అయ్యో.. రూ. 3 లక్షలు పోయాయ్..!

ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠల మధ్య నిజామాబాద్ జిల్లాలో వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం పూర్తయింది. డ్రా ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారి మొహాలు చిన్నబోయాయి. డబ్బులు పోయిన బాధతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకుంటే డ్రాలో పేరు రాలేదని నైరాశ్యంలో మునిగారు.


