News February 7, 2025
లింగంపేట్: దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

లింగంపేట్ మండలం కోమట్ పల్లి గ్రామంలో శుక్రవారం కొందరు అపరిచిత వ్యక్తులను స్థానికులు పోలీస్‌లకు అప్పగించారు. గ్రామంలో జాతకాలు చెప్తామని, మీ ఇంట్లో అశుభం జరుగుతుందని గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేసినట్లు స్థానికులు తెలిపారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. మంత్రి సంతాపం

AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ X వేదికగా స్పందించారు. అన్వర్ జాన్ మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.
News March 7, 2026
మన పల్లె-మన నీరు పనుల నిర్వహణకు చర్యలు: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టరేట్లో మన పల్లె-మన నీరు పనులపై కలెక్టర్ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మన పల్లె-మన నీరు పనులలో భాగంగా జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపొందించేందుకు చెరువులు, సప్లై ఛానల్, చెరువులలో కంపచెట్లు తొలగింపు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. నీటి విలువ సంరక్షణకు పూడిక తీసే పనులు వర్షాకాలం కంటే ముందే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News March 7, 2026
కడప: ‘10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి’

కడప జిల్లాలో 10th పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జేసీ నిధిమీనా పరీక్షల నిర్వాహక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవన్‌లో పది పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 169 సెంటర్లలో 28,158 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్జేడీ శామ్యూల్, ఏసీ , డీఈఓ శంషుద్దీన్ హాజరయ్యారు.


