News January 17, 2025
లింగంపేట్: యాక్సిడెంట్లో యువకుడి మృతి.. గ్రామస్థుల ధర్నా

లింగంపేట మండలం ముస్తాపూర్ తండాలో గ్రామానికి చెందిన మోహన్ అనే యువకుడు గురువారం రాత్రి బైక్పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో అతను మృతి చెందాడని కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Similar News
News December 27, 2025
NZB: 129 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: ఇన్ఛార్జ్ CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 129 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర తెలిపారు. వీరందరినీ కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. న్యాయమూర్తి 129 మందికి రూ.8.80 లక్షల జరిమానా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని వెల్లడించారు.
News December 26, 2025
NZB: చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈనెల 19వ తేదీన ఆస్పత్రి మెయిన్ గేటు పక్కన గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదురు వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి వయస్సు 40-49 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు.
News December 26, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు టెక్నికల్ ఆఫీషియల్స్ నిజామాబాద్ జిల్లా వాసులు

తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్ కుమార్, సాయిలు టెక్నికల్ అఫీషియల్స్గా నియమితులయ్యారు. ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్ జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరగనున్న 72వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పురుషుల, మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్-2025 పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం పట్ల ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం తదితరులు అభినందించారు.


