News March 14, 2025

లింగంపేట: చెరువులో పడి మహిళ మృతి

image

చెరువులో పడి ఒక మహిళ మృతి చెందినట్లు లింగంపేట ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంబోజీపేట గ్రామానికి చెందిన కాశవ్వ గత నాలుగు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లిందన్నారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినట్లు తెలిపారు. గ్రామ శివారులోని చెరువులో ఆమె మృతదేహం లభించగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News September 19, 2025

విజయవాడ: క్షేత్రస్థాయిలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌

image

దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో కాలినడకన పర్యటించి పరిశీలించారు. ఈ ఏడాది భక్తులకు మధురానుభూతులను మిగిల్చేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News September 19, 2025

NZB: SC, ST కోర్టు PPగా దయాకర్ గౌడ్

image

నిజామాబాద్ జిల్లా SC, ST కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా R.దయాకర్ గౌడ్ నియమితులయ్యారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన జర్నలిస్ట్‌గా ప్రస్థానం మొదలు పెట్టారు. 2004 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. TPCC లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్‌గా ఉన్న ఆయన పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తూన్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతల సమన్వయంతో PPగా నియమితులయ్యారు.

News September 19, 2025

ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర కింద ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అటు నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది.