News November 6, 2024
లింగంపేట: నాగన్న బావిని పరిశీలించిన కలెక్టర్

లింగంపేట మండల కేంద్రంలో ఉన్న నాగన్న బావిని ఇవాళ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నాగన్న బావిని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని, కాటేజీలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. బావిలో ఉన్న చెత్తను తొలగించాలని, సమీపంలో మొక్కలు నాటి సంరక్షించాలని వారు సూచించారు. అనంతరం బావి చూడడానికి వచ్చిన పాఠశాల చిన్నారులతో పురాతన బావి దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు.
Similar News
News December 4, 2025
ఎడపల్లి: ఎన్నికల విధులను అప్రమత్తతతో నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నెల 11న మండలంలో మొదటి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల నుంచి పోలింగ్ ఏర్పాట్ల వరకు కలెక్టర్ సమీక్షించారు.
News December 4, 2025
NZB: మరోసారి అవకాశం కల్పిస్తా ఈ సారికి ఆగు..!

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా మూడో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.
News December 4, 2025
నిజామాబాద్: 27 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవం

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగియగా జిల్లాలో 27 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. వర్ని మండలంలో 10, బోధన్ మండలంలో 4, సాలూర మండలంలో 3, కోటగిరి మండలంలో 5, చందూరు మండలంలో 2, పోతంగల్, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.


