News November 6, 2024
లింగంపేట: నాగన్న బావిని పరిశీలించిన కలెక్టర్

లింగంపేట మండల కేంద్రంలో ఉన్న నాగన్న బావిని ఇవాళ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నాగన్న బావిని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని, కాటేజీలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. బావిలో ఉన్న చెత్తను తొలగించాలని, సమీపంలో మొక్కలు నాటి సంరక్షించాలని వారు సూచించారు. అనంతరం బావి చూడడానికి వచ్చిన పాఠశాల చిన్నారులతో పురాతన బావి దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు.
Similar News
News November 15, 2025
NZB: ‘Unsung Guru’ అవార్డుకు ఫుట్బాల్ కోచ్ నాగరాజు

NZB జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ ఫుట్బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ‘ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ కోచ్ ఇన్ ఇండియా’ (FFCI) ఆధ్వర్యంలో కోల్‌కత్తలో 15న నిర్వహించే ఈ అవార్డుల కోసం నాగరాజుకు ఆహ్వానం పంపింది. గ్రాస్ రూట్‌లో శిక్షణ ఇస్తూ ఫుట్బాల్ క్రీడా ప్రాచుర్యాన్ని, విశిష్టతను పెంపొందించడంతోపాటు అంకితభావంతో శిక్షణను అందిస్తున్నందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
News November 15, 2025
NZB: గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని భావం సాహెబ్ పాడ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అమీర్ ఖాన్ అనే వ్యక్తి బైక్‌పై 260 గ్రాముల ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు.
News November 14, 2025
ఆర్మూర్: విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయండి: DIEO

ఇంటర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంటర్ బోర్డు కమిషనర్ సూచించిన మేరకు ప్రతి అధ్యాపకుడు ఉద్యోగి విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయాలని NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆర్మూర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, గిరిజన బాలుర జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.


