News February 2, 2025
లింగంపేట: బెల్ట్ షాపులు నిర్వహించవద్దని తీర్మానం

లింగంపేట మండలం పరిమళ్ళలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహించవద్దని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపుల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బెల్ట్ షాపులను ఎవరు ప్రోత్సహించినా అమ్మినా సహించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News December 6, 2025
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల కమీషన్ సూచనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించే ఓటర్లకు, అత్యవసర సేవలలో పనిచేసే ఓటర్లకు సౌకర్యం కల్పించామని చెప్పారు. దీనికోసం పోస్టల్ ఓటింగ్ సెంటర్/ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ సంబంధిత మండలాల ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేశామన్నారు.
News December 6, 2025
విజయనగరం: పెన్షన్ దారులకు అలర్ట్.!

జిల్లాలో కుటుంబ పెన్షన్ దారులు 2026 సంవత్సరానికి లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి నాగ మహేశ్ శనివారం తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025లో సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్లు 2026కి చెల్లవని, ఇప్పటికే సమర్పించినవారు మళ్లీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఉప ఖజానా కార్యాలయాల్లో సర్టిఫికెట్లు సమర్పించవచ్చని తెలిపారు.
News December 6, 2025
NRPT: లోక్ అదాలత్ విజయవంతం చేయాలి: సీనియర్ సివిల్ జడ్జి

ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని NRPT సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అధికారులకు సూచించారు. శనివారం NRPT కోర్టులో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్లు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లోక్ అదాలత్ కార్యక్రమంపై కక్షిదారులకు అవగాహన కల్పించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని ఆమె అన్నారు.


