News February 2, 2025
లింగంపేట: బెల్ట్ షాపులు నిర్వహించవద్దని తీర్మానం

లింగంపేట మండలం పరిమళ్ళలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహించవద్దని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపుల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బెల్ట్ షాపులను ఎవరు ప్రోత్సహించినా అమ్మినా సహించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News February 15, 2025
పరిగెలను పదవి నుంచి తప్పించిన షర్మిల

కర్నూలు డీసీసీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మురళీకృష్ణ డీసీసీ ఆస్తులను సొంత ఆస్తులుగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి, అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల ఏపీసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను పదవి నుంచి తప్పించారు.
News February 15, 2025
ఖమ్మం జిల్లాలో రూ.598 కోట్ల పెండింగ్ కరెంట్ బిల్లులు

ఖమ్మం జిల్లాలో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. విద్యుత్తుశాఖలో భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయి. ప్రైవేట్, ప్రభుత్వశాఖల నుంచి మొత్తం రూ.598 కోట్ల బకాయిలున్నాయి. ఇంత మొత్తం బకాయిలు ఉండటంతో ఆ శాఖపై పెనుభారం పడుతోంది. సంబంధిత శాఖ బకాయిలను రికవరీ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ బకాయిల్లో సింహభాగం రూ.241 కోట్లు మిషన్ భగీరథవి ఉండటం గమనార్హం.
News February 15, 2025
జగిత్యాల: జిల్లాలోని 50 PACS పాలకవర్గాల గడువు పొడిగింపు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు రేపటితో ముగియనుంది. దీంతో ప్రభుత్వం పాలక వర్గాల గడువును 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. JGTL జిల్లాలో 50 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రస్తుత పాలకవర్గాలకు మరో 6 నెలల పాటు అవకాశం లభించింది. ప్రస్తుత PACSల పునర్విభజన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటివరకు ఆయా సంఘాల ఛైర్మన్లు పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగుతారు.