News February 13, 2025
లింగంపేట: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన లింగపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ అనిల్ వివరాల ప్రకారం.. మండలానికి చెందిన కుర్ర వెంకటి (25) 3 నెలల క్రితం ఆరేపల్లిలో చెరుకు కొట్టడానికి వెళ్లాడు. కాగా బుధవారం చెరకు కొట్టి గుడిసెలోనికి వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News November 18, 2025
ఖైదీని మార్చిన పుస్తకం!

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.
News November 18, 2025
గ్రేటర్ తిరుపతి ఇలా..!

తిరుపతి కార్పొరేషన్ విస్తరణలో భాగంగా 63 గ్రామాలు విలీనం కానున్నాయి. తిరుపతి రూరల్ మొత్తం కార్పొరేషన్లో కలిపేస్తారు. చంద్రగిరి మండలంలోని 21 గ్రామాల్లో 13 గ్రేటర్లో కలుస్తాయి. విలీనంతో నగర జనాభా 4.52 లక్షల నుంచి 7.86 లక్షలకు చేరనుంది. ఆదాయం సైతం రూ.149 కోట్ల నుంచి రూ.192.20 కోట్లకు చేరే అవకాశముంది. ప్రస్తుతం తిరుపతి విస్తీర్ణం 30.174 చ.కిమీ ఉండగా విలీనంతో 300.404 చ.కిమీకు పెరగనుంది.
News November 18, 2025
మంగళగిరి: భార్యని హత్య చేసిన భర్త

గుంటూరు(D) మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ(29) ఐదేళ్ల క్రితం శంకర్ రెడ్డిని పెళ్ళి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త శంకరరెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.


