News February 13, 2025

లింగంపేట: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన లింగపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ అనిల్ వివరాల ప్రకారం.. మండలానికి చెందిన కుర్ర వెంకటి (25) 3 నెలల క్రితం ఆరేపల్లిలో చెరుకు కొట్టడానికి వెళ్లాడు. కాగా బుధవారం చెరకు కొట్టి గుడిసెలోనికి వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News July 6, 2025

పాశమైలారం: 43కు చేరిన మృతుల సంఖ్య

image

పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఆదివారానికి 43కి చేరింది. డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతులకు పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. పరిశ్రమ వద్ద ఏడో రోజు కూడా సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. తమ వాళ్ల మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారని కుటుంబసభ్యులు ఆసుపత్రుల వద్ద ఎదురుచూస్తున్నారు.

News July 6, 2025

రాజాపూర్: గొంతులో పూరి ఇరుక్కుని యువకుడి మృతి

image

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖానాపూర్‌కు చెందిన బ్యాగరి కిరణ్ కుమార్ (25) వ్యవసాయ పొలంలో పూరీలు తింటుండగా గొంతులో ఇరుక్కొనడం వల్ల ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News July 6, 2025

వరల్డ్ అథ్లెటిక్స్ నిర్వహణ కోసం పోటీలో భారత్

image

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడం కోసం భారత్ బిడ్లు దాఖలు చేయనుంది. 2029, 2031 ఎడిషన్ల కోసం బిడ్లు వేయనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ స్పోక్స్ పర్సన్ ఆదిల్ సుమారివాలా వెల్లడించారు. ఏదైనా ఒక ఎడిషన్‌ను నిర్వహించే అవకాశం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. బిడ్ల దాఖలుకు గడువు ఈ ఏడాది OCT1తో ముగియనుంది. హోస్ట్‌ల వివరాలను వరల్డ్ అథ్లెటిక్స్ వచ్చే ఏడాది SEPలో ప్రకటిస్తుంది.