News January 28, 2025

లింగనిర్థారణ చేస్తే 3 నెలల జైలు: లీలావతి

image

గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మంగళవారం న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి అతిథిగా హాజరై ప్రసంగించారు. లింగ నిర్థారణ చట్టపరంగా నేరమని, సమాజంలో ఆడ, మగపిల్లలను సమానంగా చూడాలని అన్నారు. లింగ నిర్థారణ చేస్తే 3 సంవత్సరాలు రూ.50 వేల జరిమానా విధించడం జరుగుతుందని చెప్పారు. ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

Similar News

News February 24, 2026

ప్రైవేటుకు దీటుగా జూనియర్ కాలేజీలు: లోకేశ్

image

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. వీటిని ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్‌లో మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు ఇస్తోందన్నారు. త్వరలో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, పోటీ పరీక్షల మెటీరియల్ కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News February 24, 2026

గుంటూరు: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనుటకు బస్ సౌకర్యం అంశాలను అడిగారు.

News February 24, 2026

గుంటూరు ఛానల్ వంతెన నిర్మాణానికి నిధులు

image

గుంటూరు ఛానల్‌పై వంతెన పునర్నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఛానల్‌లోని 33.300 కి.మీ వద్ద సింగిల్ లేన్ వంతెన నిర్మించనున్నారు. దీని కోసం రూ.94.88 లక్షలు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ ఈ మేరకు జీవో-92 విడుదల చేసింది. తగిన సాంకేతిక అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం పనులు ప్రారంభించాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.