News January 30, 2025
లింగపాలెం: రక్తపు మడుగులో మహిళ మృతి

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో గురువారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన జక్కంపూడి. నాగమణి(35) తన ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 7, 2025
KMR: గుర్తులొచ్చేశాయ్.. ఇక ప్రచారమే లక్ష్యం!

కామారెడ్డి జిల్లాలో 2వ విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం శనివారంతో ముగిసింది. పలు మండలాల్లో పోటీ నుంచి పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. దీంతో ఎన్నికల వేడి జిల్లాలో మరింత రాజుకుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచార రంగంలోకి దిగారు.
News December 7, 2025
ఆ మాట అనకుండా ఉండాల్సింది: SA కోచ్

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత ఆ టీమ్ హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ వాడిన గ్రోవెల్(సాష్టాంగం పడటం) పదంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్లో ఓటమి తర్వాత ఆ కాంట్రవర్సీపై ఆయన స్పందించారు. ‘తప్పుడు ఉద్దేశంతో ఆ మాట అనలేదు. ఇంకా బెటర్ వర్డ్ ఎంచుకుని ఉండాల్సింది. భారత్ మైదానంలో ఎక్కువసేపు గడిపి ఉండాల్సింది అన్న ఉద్దేశంలో అలా అన్నాను. వినయమే SA టెస్టు టీమ్ పునాది’ అని తెలిపారు.
News December 7, 2025
కొత్తగూడెం: వామ్మో.. రూ.12.35 లక్షల కరెంటు బిల్లు హా

ప్రతినెల వేలల్లో వచ్చే కరెంటు బిల్లు ఒక్కసారిగా రూ.12,35,191 రావడంతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్కు చెందిన షాపు నిర్వాహకుడు అశోక్ ఆందోళనకు గురయ్యారు. గత నెలలో రూ.40,063 ఉన్న బిల్లు ఈ నెలలో లక్షల్లో చేరడాన్ని చూసి అవాక్కయ్యారు. అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని, సరిచేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


