News January 30, 2025

లింగపాలెం: రక్తపు మడుగులో మహిళ మృతి

image

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో గురువారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన జక్కంపూడి. నాగమణి(35) తన ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 7, 2025

ఆ రెండ్రోజులు బ్యాంకులు బంద్?

image

మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగనుండటంతో బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 2 రోజుల సెలవులు, కొత్త జాబ్స్, DFS రివ్యూను తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల గ్రాట్యుటీ వరకు IT మినహాయింపు డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.

News February 7, 2025

నల్గొండ: గ్రీవెన్స్ డే.. ఇక నుంచి ‘డయల్ యువర్ సైబర్ నేస్తం’

image

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ఇప్పటినుంచి సైబర్ క్రైమ్‌కి సంబంధించిన ఫిర్యాదులు కూడా తీసుకోనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ మేరకు ‘డయల్ యువర్ సైబర్ నేస్తం’ అనే కార్యక్రమాన్ని ఈ సోమవారం నుంచే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బాధితులు తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.

News February 7, 2025

కాళేశ్వరంలో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు

image

కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగు నీటి ఏర్పాటు, తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటుగా అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.

error: Content is protected !!