News January 22, 2025
లింగమంతుల స్వామి జాతర టెండర్లు ఖరారు

సూర్యాపేట పరిధిలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర సందర్భంగా ఎగ్జిబిషన్, చిరు దుకాణాల కాళి స్థలం, మిఠాయి, స్వీట్స్, వరి పేలాలు, బొంగులు, చెరుకు గడలు, జాతర చుట్టూ విద్యుత్ సరఫరాకు టెండర్లను మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్ బుధవారం ఖరారు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో జాతరలో మున్సిపాలిటీకి టెండర్ల మీద ఆదాయం రూ. 56,43,754 రాగా ఈసారి రూ. 68,83,650 మున్సిపాల్టీకి సమకూరనున్నట్లు చెప్పారు.
Similar News
News February 9, 2025
మెదక్: నకిలీ బంగారంతో భారీ మోసం.. నలుగురి అరెస్ట్

నకిలీ బంగారం పెట్టి తూకంలో మోసం చేసిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణంలోని ముత్తూట్ మినీ ఫైనాన్స్ మేనేజర్‌గా గుండె రాజు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న సురేశ్, ఆకాశ్‌లతో కలిసి నకిలీ బంగారంతో చేసి రూ.7,20,356 నగదును సంస్థ నుంచి తీసుకుని బ్యాంకును మోసం చేసి తప్పించుకున్నాడు. రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.
News February 9, 2025
మంచిర్యాల: పావురం కోసం క్రేన్ పంపిన కలెక్టర్

నస్పూర్‌లోని సీసీసీ కార్నర్‌లో సెంట్రల్ లైటింగ్ స్తంభంపై ఓ పావురం గాలిపటం దారానికి చిక్కుకుంది. గమనించిన స్థానికులు కలెక్టరేట్‌కు సమాచారం అందజేయడంతో స్పందించి కలెక్టర్ క్రేన్‌ను పంపించారు. అక్కడకు చేరుకున్న మున్సిపల్ సిబ్బంది నిచ్చెన సాయంతో పైకి ఎక్కి దాన్ని విడిపించారు. దీంతో పావురం అక్కడనుంచి స్వేచ్ఛగా ఎగిరిపోయింది.
News February 9, 2025
భార్యను నరికిన ఘటనలో మరో సంచలనం!

TG: హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన <<15262482>>ఘటనలో<<>> మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటమాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు కుటుంబీకులు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని భావిస్తున్నారు. ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు శనివారం నుంచి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తున్నారు.