News August 8, 2024
లింగసముద్రం: రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

లింగసముద్రంలోని కమ్మిశెట్టి రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సాఫ్ట్ బాల్ ఆటలో రాణించడంతో రాష్ట్ర స్థాయి ఆటలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉమ్మడిశెట్టి మాధవరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన వెంకటేశ్, ప్రతిమలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పీఈటీలు పాల్గొన్నారు.
Similar News
News December 3, 2025
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్.!

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క వసతి గృహాన్ని దత్తత తీసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. దీంతో ఆయా వసతి గృహాల్లో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కార దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
News December 3, 2025
ప్రకాశం: ఆకలితో అలమటించిన విద్యార్థులు.. వార్డెన్ సస్పెండ్.!

విధుల పట్ల అలసత్వం వహించిన కొనకనమిట్ల సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజాబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించకపోవడంతో విద్యార్థులు పడిన ఇబ్బందులపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక మేరకు వార్డెన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.