News February 3, 2025
లింగాపూర్: పనిచేసుకుని బ్రతకమన్నందుకు చనిపోయాడు!

పనిచేసుకోని బ్రతుకు అన్నందుకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట లింగాపూర్ మండలంలోని వంజారిగూడ గ్రామంలో చోటుచేసుకున్నది. లింగాపూర్ ఎస్సై గంగన్న తెలిపిన వివరాలిలా.. వంజారిగూడకి చెందిన అవినాష్ (19) రెండేళ్ల క్రితం చదువు మానేసి ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి హనుమంతు ఏదైనా పని చేసుకోవాలని మందలించడంతో జనవరి 31న ఇంట్లోనే ఉన్న గుర్తుతెలియని పురుగు మందు తాగాడు. రిమ్స్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Similar News
News November 28, 2025
పశ్చిమ గోదావరిలో కొత్త ట్రెండ్.. క్లిక్ కొడితే కోడి ఇంటికే!

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. పండుగకు ముందే పందెం పుంజుల విక్రయాల్లో నూతన ఒరవడి కనిపిస్తోంది. సాంకేతికతను వినియోగించుకుంటూ విక్రయదారులు ఆన్లైన్ వేదికగా కోళ్లను అమ్మకానికి పెడుతున్నారు. రంగు, జాతితో పాటు వాటి జాతక వివరాలను సైతం పొందుపరుస్తుండటం విశేషం. రూ.వేల నుంచి లక్షల్లో ధర పలుకుతున్న ‘డిజిటల్’ పుంజుల అమ్మకాలు ఆసక్తికరంగా మారాయి. క్లిక్ కొడితే కోడి ఇంటికే వచ్చేస్తోంది.
News November 28, 2025
సిద్దిపేట: “హైదరాబాద్ రైజింగ్” లక్ష్యం: మంత్రి

తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంకేతికత, సంస్కృతి, ఆవిష్కరణలతో శాశ్వత సంబంధాలను నెలకొల్పేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. 2047 నాటికి తెలంగాణ “హైదరాబాద్ రైజింగ్” లక్ష్యంతో సురక్షితమైన నగరంగా మారుతుంది అన్నారు. యువత, మహిళలు, రైతులను శక్తిమంతం చేసేందుకు మానవ మూలధనంపై పెట్టుబడులు పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News November 28, 2025
VKB: కారు బైక్, ఢీ.. ఒకరి మృతి

నవాబుపేట మండలం, మైతాబ్ ఖాన్ గూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న మోమిన్పేట మండలం, దేవరపల్లికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు కూడా అదే గ్రామానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు ఆరా తీస్తున్నారు.


