News February 3, 2025

లింగాపూర్: పనిచేసుకుని బ్రతకమన్నందుకు చనిపోయాడు!

image

పనిచేసుకోని బ్రతుకు అన్నందుకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట లింగాపూర్ మండలంలోని వంజారిగూడ గ్రామంలో చోటుచేసుకున్నది. లింగాపూర్ ఎస్సై గంగన్న తెలిపిన వివరాలిలా.. వంజారిగూడకి చెందిన అవినాష్ (19) రెండేళ్ల క్రితం చదువు మానేసి ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి హనుమంతు ఏదైనా పని చేసుకోవాలని మందలించడంతో జనవరి 31న ఇంట్లోనే ఉన్న గుర్తుతెలియని పురుగు మందు తాగాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Similar News

News February 9, 2026

నలుగురు లెక్చరర్లు.. రూ.4 లక్షల జీతం.. ఒక్కరే విద్యార్థి

image

AP: విద్యావ్యవస్థలో సరైన ప్రణాళిక, ముందుచూపు, కార్యాచరణ లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిపే ఘటన ఇది. ఏలూరు(D) ముసునూరు ZP స్కూల్‌లో ఏర్పాటైన జూనియర్ కాలేజీలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి ఉండగా, పాఠాలు చెప్పడానికి నలుగురు లెక్చరర్లు ఉన్నారు. వీరికి ప్రతినెలా ₹4L జీతం చెల్లిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News February 9, 2026

నరదిష్టి నివారణ పూజ

image

విజయప్రాప్తి, సకల శుభాలు కలగాలంటే నరదిష్టి నివారణ పూజ ఎంతో ప్రయోజనకరం. ఈ పూజతో ఇతరుల అసూయ, నెగటివ్ ఎనర్జీ, దిష్టి దోషాల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ శాస్త్రోక్త పూజతో అనారోగ్యాలు తొలగి, మానసిక శాంతి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ రక్షణ చేకూరుతాయి. మీ పేరు, గోత్రంతో నిర్వహించే ఈ పూజ పూర్తి వీడియో రికార్డ్‌ను మీ వాట్సాప్‌కు పంపిస్తాము. ఆటంకాలను తొలగించుకోవడానికి వేదమందిర్‌లో ఇప్పుడే పూజ <>బుక్ చేసుకోండి.<<>>

News February 9, 2026

సీఎం వీసీలో జిల్లా కలెక్టర్, జేసీ

image

స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్, శాంతిభద్రతల అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.