News July 25, 2024
లింగాలఘనపురం: ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు

లింగాల ఘనపురం మండలం వనపర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్ఓటీగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశానుసారం సస్పెండ్ చేస్తూ డీఈఓ రాము బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల నోడల్ అధికారి పడాల విష్ణుమూర్తి తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా గత నెల 4 నుంచి విధులకు గైర్హాజరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.
News November 22, 2025
వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.