News March 26, 2025
లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం: MNCL కలెక్టర్

లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. స్కానింగ్ సెంటర్లలో పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలపవద్దని సూచించారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో తగ్గిన బాలికల నిష్పత్తిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 23, 2025
సంగారెడ్డి: ‘మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం’

సంగారెడ్డి జిల్లాలో డ్వాక్రా గ్రూపు మహిళలకు రూ. 590 కోట్ల రుణాలను అందించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రూ. 32 కోట్ల వడ్డీ రాయితీ రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే సీఎం రేవంత్ రెడ్డి లక్షమని పేర్కొన్నారు.
News November 23, 2025
ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు

AP: ఇంధన సామర్థ్యం/పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెన్కో MD నాగలక్ష్మి వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీకి అర్హులని తెలిపారు. ‘తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 30-120సెకన్ల నిడివితో MP4 ఫార్మాట్లో వీడియోలు రూపొందించి DEC 10లోగా పంపాలి. తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి ₹20K, ₹10K, ₹5K బహుమతులు ఇస్తాం. వివరాలకు 0866-2457620 నంబరులో సంప్రదించాలి’ అని చెప్పారు.
News November 23, 2025
సత్యవేడు: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIITలో 2026 సంవత్సరానికి సంబంధించి MS (Research)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. 3 విభాగాలలో కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://iiits.ac.in/admissions/ms-research-programme/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.


