News February 22, 2025
లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమవారంలో లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ హనుమంతరావుకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్ సందిగారి బసవయ్య, ధర్మకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2025
అనకాపల్లి: ఈ నెల 25న చికెన్ అండ్ ఎగ్ మేళా

ఈ నెల 25 న ఎన్టీఆర్ స్టేడియంలో చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహిస్తున్నట్లు నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ తెలిపింది. ఆదివారం స్థానిక విజయరెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. బర్డ్ ఫ్లూ పై వస్తున్న వదంతుల నేపథ్యంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మేళాలో పాల్గొంటారని తెలిపారు.
News February 23, 2025
జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్(PHOTOS)

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ సూట్లో గాగుల్స్ పెట్టుకుని చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. దీంతో తారక్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ WAR2, ప్రశాంత్ నీల్ సినిమాల్లో నటిస్తున్నారు.
News February 23, 2025
చేన్నేకొత్తపల్లి: పాము కాటుకు గురై చిన్నారి మృతి

చేన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురానికి చెందిన ప్రీతి అనే మూడో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శనివారం రాత్రి ప్రీతి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా.. నాగుపాము కాటు వేయడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విద్యార్థిని తల్లితండ్రులు తెలిపారు.