News November 15, 2024
లింబాద్రి గుట్ట: నేడే రథోత్సవం-సర్వం సిద్ధం

భీంగల్ మండలం లింబాద్రి గుట్టపై శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం జరగనుంది. భక్తులంతా రథోత్సవాన్ని వీక్షించేలా నేడు ఉదయం 11:30గంటల నుంచి యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో చుట్టూ పక్కల గ్రామాల భక్తులే కాకుండా జిల్లా నుంచి పాల్గొంటారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News February 12, 2026
NZB: ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు: కలెక్టర్

స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తూ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభించేందుకు వీలుగా సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని కలెక్టర్ తెలిపారు.
News February 12, 2026
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: NZB కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులకు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్లకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను కలెక్టర్ సందర్శించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాల్సిన విధానం గురించి వివరించారు.
News February 12, 2026
నిజామాబాద్ జిల్లాలో క్యాంప్ రాజకీయాలు

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన అభ్యర్థులు చేజారకుండా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే సూర్యనారాయణ, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో అభ్యర్థులను తరలించేందుకు ప్రైవేట్ బస్సులు సిద్ధం చేసినట్లు సమాచారం.


