News July 27, 2024

లిక్క‌ర్ ధ‌ర‌లు భారీగా పెంచబోతున్నారు: ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

image

ఇటీవ‌లే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన 2024-25 బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఎక్సైజ్ అంశంపై తీవ్రంగా స్పందించారు. బీర్లు, లిక్క‌ర్ ధ‌ర‌లు రాబోయే రోజుల్లో భారీగా పెంచ‌బోతున్న‌ట్లు బ‌డ్జెట్ అంచ‌నాలు ప‌రిశీలిస్తే స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కులు త‌లదించుకోవాల‌ని ఆయన విమ‌ర్శించారు.

Similar News

News November 27, 2025

నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూడాలి: SP

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. హవేలిఘనపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల పురస్కరించుకొని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేందుకు, నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరిగేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

News November 26, 2025

మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

image

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.