News February 12, 2026

లిక్కర్ స్కామ్‌కు రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్: సుప్రీంకోర్టు

image

AP: మద్యం కుంభకోణానికి రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్ అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారించేందుకు నిరాకరించింది. దీంతో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రాజ్ తరఫు న్యాయవాది చెప్పగా ధర్మాసనం అనుమతించింది. ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

Similar News

News March 11, 2026

ఉక్రెయిన్ ఆఫర్‌కు నో.. US చేసిన బిగ్ మిస్టేక్!

image

ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడంలో US భారీ పొరపాటు చేసినట్లు సమాచారం. యుద్ధానికి 7 నెలల ముందే ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చే టెక్నాలజీని ఇస్తామని ఉక్రెయిన్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేసిన ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అప్పట్లో తిరస్కరించిందట. తీరా ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థలను దెబ్బ తీస్తుండటంతో వాషింగ్టన్ ఇప్పుడు తిరిగి అదే ఉక్రెయిన్‌ను ఆశ్రయిస్తోంది.

News March 11, 2026

‘టీ’తో హెల్తీ కాంబినేషన్స్ ఇవే..

image

టీ తాగేటప్పుడు బిస్కెట్లు, రస్క్‌లు, ఫ్రైడ్ స్నాక్స్ తింటుంటారు. కానీ వీటి వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా బరువు పెరగడం, డయాబెటిస్ వంటి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటికి బదులు వేయించిన శనగలు, పల్లీలు, నట్స్, డ్రైఫ్రూట్స్, మఖానా వంటి ఫైబర్, ప్రొటీన్ రిచ్ స్నాక్స్ తీసుకుంటే బెటర్. టీ తాగిన తర్వాత లేదా ముందు ఫ్రూట్స్, స్ప్రౌట్స్, పనీర్ క్యూబ్స్ తిన్నా మంచిదే.

News March 11, 2026

ట్రంప్ కీలక నిర్ణయం.. రిలయన్స్‌తో భారీ డీల్

image

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ ఆయిల్ రిఫైనింగ్ ప్రాజెక్టును అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత USలో ఏర్పాటవుతున్న తొలి రిఫైనరీ ఇదే. ఈ $300 బిలియన్ల ప్రాజెక్టులో రిలయన్స్ పార్ట్‌నర్‌గా చేరుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అందుకు కంపెనీకి థాంక్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే క్లీన్లీయెస్ట్ రిఫైనరీ అని, వేలాది ఉద్యోగాలు రావడమే కాకుండా అమెరికా ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుందని పేర్కొన్నారు.