News February 27, 2026
లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్‌చిట్

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో ఆమె పేరును కూడా రౌస్ అవెన్యూ కోర్టు డిశ్ఛార్జ్ చేసింది. దీంతో కవితకు క్లీన్‌చిట్ లభించినట్లు అయింది. కాగా ఈ కేసులో కవిత 166 రోజులు జైలు జీవితం గడిపారు. మరోవైపు ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి కూడా క్లీన్‌చిట్ లభించింది.
Similar News
News April 11, 2026
GNT: కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు కానిస్టేబుళ్లు

గుంటూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కోర్టుకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. CMS సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని, కేసుల పురోగతి, నిందితుల హాజరు, సాక్ష్యాల సమర్పణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ఈ విధానం ద్వారా కేసుల పరిష్కార వేగం పెరిగి బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని DCRB సీఐ ప్రభాకర్, CMS సీఐ ధర్మేంద్ర బాబు తెలిపారు.
News April 11, 2026
శాంసన్ సెంచరీ.. చెన్నై భారీ స్కోర్

చెపాక్ స్టేడియం వేదికగా DCతో జరుగుతున్న మ్యాచ్‌లో CSK 212/2 స్కోర్ చేసింది. శాంసన్ అజేయ సెంచరీ(56 బంతుల్లో 115)తో చెలరేగారు. ఆయుష్ మాత్రే 59 పరుగులతో అదరగొట్టి రిటైర్డ్ ఔట్(స్వచ్ఛందంగా పెవిలియన్‌కు వెళ్లడం)గా వెనుతిరిగారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15, శివమ్ దూబే 20* రన్స్ చేశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు.