News June 4, 2024
లీడ్‌లో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి లీడ్‌లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పురందీశ్వరి 1973 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి గూడురు శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి గుడిగు రుద్రరాజు తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 1వ రౌండ్‌లో ఓట్లు ఇలా..
➢ పురందీశ్వరి: 1973
➢ చెల్లుబోయిన: 4195
➢ మురళీధర్: 371
➠ 2వ రౌండ్ ముగిసే సరికి పురందీశ్వరి 1973 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
Similar News
News November 5, 2024
కోనసీమ అబ్బాయి, కెనడా అమ్మాయి పెళ్లి
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కెనడా అమ్మాయితో సోమవారం అమలాపురానికి చెందిన అబ్బాయితో పెళ్లి జరిగింది. అమలాపురానికి చెందిన మనోజ్ కుమార్ కెనడాకు చెందిన ట్రేసీ రోచే డాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమలాపురం వచ్చిన కెనడా అమ్మాయి బంధువులు పెళ్లి ఇంట సందడి చేశారు. తెలుగు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. ఆ దేశస్థులు మంత్రముగ్ధులయ్యారు.
News November 5, 2024
మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం: పవన్ కళ్యాణ్
యు.కొత్తపల్లి మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గొల్లప్రోలులో జరిగిన సమావేశంలో ఆయన ఈ సమస్యలపై ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులను వివరాలు తెలుసుకున్నారు. వారు అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేయడం వల్ల మత్స సంపద నశిస్తుందని ఆయన దృష్టికి వచ్చారు. దీనిపై ఫార్మా కంపెనీ అధికారులు, మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు
News November 4, 2024
తూ.గో: మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
తూ.గో.జిల్లాకు చెందిన నాగమణి అనే మహిళ బహ్రెయిన్ వెళ్లి ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన లోకేశ్ ఆమెను రాష్ట్రానికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చారు. దీనిపై నాగమణి లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తనను ముగ్గురు ఏజెంట్లు మోసం చేశారని ఆమె వాపోయారు.