News February 13, 2025

లెదర్ పార్క్ పై కొరియన్ బృందంతో జిల్లా కలెక్టర్ భేటీ

image

నరసరావుపేట పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కొరియన్ కంపెనీ బృందం సభ్యులతో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఈడీబి రంజిత్ సమావేశంలో పాల్గొన్నారు. వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసే లెదర్ పార్క్ స్థల పరిశీలన పై వారు చర్చించారు. పరిశ్రమ ఏర్పాటుతోపాటు పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. లెదర్ పార్క్ ఏర్పాటు ప్రయోజనాలను బృందం సభ్యులకు వివరించారు.

Similar News

News December 6, 2025

స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చికిత్స

image

ప్రసవ సమయంలో స్కార్‌ ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వలన తీవ్ర రక్తస్రావం కావొచ్చు. ముఖ్యంగా ప్లాసెంటా వేరుచేసే సమయంలో ఇది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించడం, రక్త మార్పిడి, ICUలో చికిత్స అవసరం కావచ్చు. గర్భాన్ని కొనసాగించాలంటే నిపుణుల పర్యవేక్షణ ఉండాలి. అవసరమైన ప్రత్యేక స్కాన్లు, పరీక్షలు చేయించుకోవాలి. ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భాన్ని తొలగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

News December 6, 2025

విజయవాడ: పనులు ఆలస్యం.. గడువు దాటినా మార్పు లేదు

image

గన్నవరం విమానాశ్రయంలో రూ. 170 కోట్లతో 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన నూతన టెర్మినల్ భవనం 30 నెలల్లో పూర్తికావాల్సి ఉండగా 68 నెలలు గడిచినా పనులు ముందుకుసాగడం లేదు. కేంద్ర మంత్రి 2 సార్లు పరిశీలించి హెచ్చరికలు చేసినా మార్పు లేక డిసెంబర్ గడువు కూడా దాటిపోయింది. ఇంకా కనీసం 6 నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. టెర్మినల్ ఆలస్యంతో బోయింగ్ సేవలు ప్రారంభం కావడం లేదు.

News December 6, 2025

గుంటూరు మీదుగా శిరిడీకి కొత్త వీక్లీ స్పెషల్ రైలు

image

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. తిరుపతి-సాయినగర్ శిరిడీ మధ్య కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి వంటి ప్రధాన స్టేషన్‌లలో ఆగుతుంది. ఇది మంగళవారం తిరుపతిలో బయలుదేరి, బుధవారం శిరిడీ చేరుకుని, తిరుగు ప్రయాణం అవుతుంది.