News February 18, 2025
లేపాక్షి ఉత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

లేపాక్షి వీరభద్రాలయంలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ చేతన్‌ను వీరభద్రాలయ ధర్మకర్తల మండల ఛైర్మన్ కరణం రమానందన్, ఆలయ కార్య నిర్వహణ అధికారి నరసింహమూర్తి ఆహ్వానించారు. ఈ ఏడాది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా బ్రహ్మ రథోత్సవం, శివపార్వతుల కళ్యాణోత్సవం, జాగారం రోజున విశేష కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
Similar News
News March 15, 2025
గుంటూరు ఛానల్‌లో గల్లంతైన బాలుడి మృతి

పెదకాకాని మండలం నంబూరులోని గుంటూరు ఛానల్‌లో శుక్రవారం గల్లంతైన బాలుడు మృతి చెందాడు. స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రొక్లెయినర్ డ్రైవర్ ఏసురత్నం, సాంబమ్మ దంపతుల 2వ కుమారుడు జాషువా(12) స్థానిక జడ్పీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో గుంటూరు ఛానల్‌కు వెళ్లాడు. సరదాగా నీటిలో దిగుదామనే ప్రయత్నం చేస్తుండగా కాలుజారి కాలువలో పడి గల్లంతై మరణించాడు.
News March 15, 2025
KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.
News March 15, 2025
విశాఖలో కేజీ కీర రూ.26

విశాఖ 13 రైతు బజార్‌లో శనివారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.28, బెండ రూ.40, బీరకాయలు రూ.54, క్యారెట్ రూ.22/27, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.52, గ్రీన్ పీస్ రూ.54, వంకాయలు రూ.40/42, కీర రూ.26, గోరు చిక్కుడు రూ.38, పొటల్స్ రూ.86, బరబాటి రూ.38గా నిర్ణయించారు.