News March 27, 2025

లేపాక్షి: పరీక్షలు సరిగా రాయలేదనే భయంతో..

image

లేపాక్షి మండలం పులమతి సడ్లపల్లి గ్రామానికి చెందిన బాబు అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందనే భయంతో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు బాబును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News December 4, 2025

కారంపూడి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

image

కారంపూడి విద్యుత్ ఏఈ పెద్ద మస్తాన్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కారంపూడికి చెందిన వలీ ఇంజినీరింగ్ వర్క్స్ వారికి అదనపు మీటర్లు కేటాయించడానికి డబ్బులు అడగడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఇవాళ బాధితుడు వలి నుంచి ఏఈ రూ.25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

News December 4, 2025

నైపుణ్య లోటుపై లోక్‌సభలో ఖమ్మం ఎంపీ ప్రశ్న

image

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్‌సభలో వివరాలు కోరారు. కేవలం 3% మంది కార్మికులకే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతికతల వినియోగ వివరాలు తెలపాలని కోరారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ లిఖితపూర్వక సమాధానమిస్తూ, ఎఫ్‌ఐసీఎస్‌ఐ ద్వారా చర్యలు తీసుకుంటూ 60 విభాగాల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు.

News December 4, 2025

సింగపూర్‌ లాంటి దేశాన్నీ ఇబ్బంది పెట్టారు: CM

image

AP: గత పాలకులు సింగపూర్‌ లాంటి దేశాన్ని, ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారని CM CBN విమర్శించారు. ‘ఆ బ్యాడ్ ఇమేజ్ చెరిపి బ్రాండ్ ఇమేజ్ తేవడంతో ఇపుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవలి MOUలన్నీ 45 రోజుల్లో గ్రౌండ్ కావాలి. భూ సేకరణలో వివాదాలు రాకూడదు. భూములిచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు సంతోషంగా ఉండాలి’ అని అధికారులకు సూచించారు. UAE మాదిరి APలో ₹500 కోట్లతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.