News March 27, 2025
లేపాక్షి: పరీక్షలు సరిగా రాయలేదనే భయంతో..

లేపాక్షి మండలం పులమతి సడ్లపల్లి గ్రామానికి చెందిన బాబు అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందనే భయంతో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు బాబును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News April 21, 2025
పాలకొల్లు: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పాలకొల్లుకు చెందిన వెంకటరావు, మురళీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురం డీఎస్పీ శ్రీవేద వివరాలను వెల్లడించారు. కొంతకాలంగా HYD, విశాఖ కేంద్రంగా వారు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. వైసీపీ నేతలు యడ్ల నాగేశ్వరరావు, తాతాజీ పరారీలో ఉన్నారన్నారు. ప.గో.జిల్లా నరసాపురం, కోనసీమ(D) రాజోలు, సఖినేటిపల్లికి చెందిన వ్యక్తులు ఇందులో ఉన్నట్టు సమాచారం.
News April 21, 2025
HYD: విభిన్న వాతవరణం.. 3 రోజులు జాగ్రత్త..!

హైదరాబాద్‌లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
News April 21, 2025
BSWD: జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన అభినయ్

బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన సకినాల అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సత్తా చాటాడు. ఆల్ ఇండియాలో 2425వ ర్యాంకు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఆదివారం ఉపాధ్యాయులు, కాలనీవాసులు,తోటి విద్యార్థులు అభినయ్‌కు అభినందనలు తెలిపారు.