News February 19, 2025
లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించండి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పెండింగ్లో ఉన్న 12 లక్షల వేతనదారుల లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించేందుకు ఏపీడీలు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని ఎంపీడీవో, ఏపీడీ, ఏపీవోలను ఆదేశించారు.
Similar News
News October 18, 2025
GNT: ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి..!

గుంటూరు జిల్లాలోని పలు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల కోసం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పడడంతో, ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని యాజమాన్యాలు మెలిక పెట్టాయి. బీటెక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పాత ఫీజుల పేరుతో పరీక్ష ఫీజులు కూడా కట్టించుకోకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.
News October 18, 2025
క్రికెటర్లకు అఫ్గాన్ క్రికెట్ బోర్డ్ నివాళి

పాక్ వైమానిక దాడుల్లో మరణించిన ముగ్గురు డొమెస్టిక్ క్రికెటర్లకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు నివాళులర్పించింది. ‘పాక్ పిరికిపంద చర్యకు ఉర్గున్ జిల్లాకు చెందిన ముగ్గురు క్రికెటర్లను కోల్పోయాం. కబీర్, సిబ్గతుల్లా, హరూన్ మృతి మన స్పోర్ట్స్ కమ్యూనిటీకి తీరని లోటు. వీరి మృతికి గౌరవార్థం పాక్, శ్రీలంకతో జరగబోయే ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నాం. ఈ దాడిలో ఐదుగురు పౌరులు కూడా చనిపోయారు’ అని తెలిపింది.
News October 18, 2025
బనకచర్లపై స్టేటస్ తెలపాలని గోదావరి బోర్డు లేఖ

AP: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ వాస్తవ స్థితి తెలియజేయాలని గోదావరి బోర్డు రాష్ట్ర జలవనరుల శాఖకు లేఖ రాసింది. లింక్ ప్రాజెక్టుల ప్రతిపాదనలపై తెలంగాణ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు వివరణ ఇవ్వాలని కోరింది. ఇటీవల బనకచర్ల డీపీఆర్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటీస్ ఇచ్చింది. దీనిపై TG జలవనరుల శాఖ అభ్యంతరం తెలుపుతూ బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.