News April 10, 2025
లేబర్ సిస్టం రద్దుపై కలెక్టర్ సమావేశం

జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా లేబర్ సిస్టం రద్దు నిర్ణయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలులోని స్పందన భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాల గురించి చర్చించారు. లేబర్ సిస్టం రద్దు వల్ల కార్మికుల హక్కులు, రక్షణలు కచ్చితంగా కల్పించబడతాయన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.
Similar News
News April 15, 2026
ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థి జిల్లా ఫస్ట్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.
News April 15, 2026
ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థికి జిల్లా ఫస్ట్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.
News April 15, 2026
ఇంటర్ ఫలితాలు.. 19వ స్థానంలో ప్రకాశం

ఇంటర్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా వి<<19653702>>ద్యార్థులు సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 19254 మందికి 13520 మంది పాసయ్యారు. 70 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 16842 మంది పరీక్షలు రాయగా 12787 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో 17వ స్థానంలో చిలిచింది. ప్రకాశం జిల్లా రాష్ట్రంలో ఇంటర్-1 ఇయర్‌లో 19వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 17వ స్థానంలో నిలిచింది.


