News March 22, 2024

‘లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి’

image

ఖమ్మం: టిఎస్‌ బిపాస్‌ విధానం ద్వారా నిర్మాణ అనుమతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్ణీత సమయంలోగా ఆమోదించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి లే అవుట్‌ అప్రూవల్‌ కమిటీ సమావేశాన్ని మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి, కలెక్టర్ నిర్వహించారు. లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Similar News

News September 29, 2024

తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి ముఖాముఖి

image

తెలంగాణలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. షామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో ఈరోజు 33 జిల్లాల తహశీల్దార్లతో మంత్రి ముఖాముఖి సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కాపాడే విషయంలో పేదలకు సహాయం అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని మంత్రి పొంగులేటి చెప్పారు.

News September 29, 2024

HYDలో మధిర మండల వాసి మృతి

image

మధిర మండలం రాయపట్నంకి చెందిన కంపసాటి కొండ హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కోర్టు కేసులో జామీను కోసం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అతణ్ని హైదరాబాదుకు తీసుకెళ్లినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సహజ మరణమా లేదా ఇతర కారణమా తెలియాల్సి ఉంది.

News September 29, 2024

పంచాయతీ ఎన్నికలు.. మహిళా ఓటర్లు ఎంతమందంటే.

image

ఖమ్మం జిల్లాలో మహిళా ఓటర్ల వివరాలను అధికారులు వెల్లడించారు. . ఖమ్మం (R) 40,807, తిరుమలాయపాలెం 25,705, కూసుమంచి 25,528, నేలకొండపల్లి 25,633,ముదిగొండ 25,026, రఘునాథపాలెం 20,954, కొణిజర్ల 21,176, వైరా13,909, చింతకాని 21,340, ఏన్కూర్ 14,340, కల్లూరు 27,473,తల్లాడ 23,336, పెనుబల్లి 22,086,సత్తుపల్లి 18,329, మధిర 16,084, బోనకల్ 18,455, ఎర్రుపాలెం 20,407,వేంసూరు 18,579, కామేపల్లి 17,779, సింగరేణి 22,862.