News November 7, 2024
లైట్ల వెలుతురులో కొత్తపల్లి జలాశయం

అల్లూరి జిల్లా ప్రముఖ పర్యటక కేంద్రం కొత్తపల్లి జలపాతాన్ని బుధవారం పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ సందర్శించారు. ఇటీవల లైట్ల వెలుతురులో తీర్చిదిద్దుతున్న వాటర్ ఫాల్స్ అందాలు రాత్రి వేళలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి ప్రమాదకరమైన పరిస్థితులు, ఇతర అవసరాలపై అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులకు రాత్రి వేళలో కూడా కొత్తపల్లి జలపాతం సందర్శనకు అందుబాటులో ఉండనుంది.
Similar News
News January 10, 2026
పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్లో 17న తుక్కు వేలం

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.
News January 10, 2026
విశాఖ: సంక్రాంతి వేళ రైతు బజార్లకు సెలవు రద్దు

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రైతు బజార్లకు ఉండే వారాంతపు సెలవులను రద్దు చేస్తున్నట్లు DD శ్రీనివాస్ కిరణ్ తెలిపారు. ఈ మంగళవారం, బుధవారం కూడా రైతు బజార్లు యథావిధిగా తెరిచే ఉంటాయని వెల్లడించారు. పండుగకు అవసరమైన కూరగాయలు, సరుకుల కొనుగోలు కోసం ప్రజలు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News January 10, 2026
బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన

బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శనివారం వేకువజాము నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తులసీదళార్చనలు చేపట్టారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


