News March 10, 2025
లైన్మెన్ మృతిపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. లైన్మెన్ రామారావు మృతి బాధ కలిగించిందన్నారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. విద్యుదాఘాతం ఘటనపై దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు.
Similar News
News November 5, 2025
వీటిని క్లీన్ చేస్తున్నారా?

మేకప్ బ్రష్లు, స్పాంజ్లకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. కానీ వాటిని ఏడాదికోసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే మేకప్ అప్లికేషన్, బ్లెండింగ్ నాణ్యత తగ్గుతుంది. అలాగే వీటిని రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మసమస్యలు వస్తాయి. వేడి నీళ్లు, డిష్ వాషర్ సోప్, యాంటి బ్యాక్టీరియల్ సోప్, బేబీషాంపూతో వాటిని సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.
News November 5, 2025
ఇవాళ రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. దీంతో సాధారణం కంటే 14% పెద్దగా, 30% అధిక కాంతివంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్గా పిలుస్తున్నారు. మన దేశంలో రా.6.49 గంటలకు పూర్ణచంద్రుడు దర్శనమిస్తాడు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది.
News November 5, 2025
జిల్లా ప్రజలకు, అధికారులకు కృతజ్ఞతలు: కలెక్టర్

మొంథా తుఫానును సమర్థంగా ఎదుర్కొన్నందుకు కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రాణ నష్టం లేకుండా పని చేసిన అధికారులను, ప్రజలను, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులను, స్వచ్ఛంద సంస్థలను ఆయన అభినందించారు. హెచ్చరికలకు స్పందించి జాగ్రత్త చర్యలు తీసుకున్నందుకు ప్రజలను ప్రశంసించారు.


