News March 10, 2025
లైన్‌మెన్ మృతిపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యుదాఘాతంతో లైన్‌మెన్ మృతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. లైన్‌మెన్ రామారావు మృతి బాధ కలిగించిందన్నారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. విద్యుదాఘాతం ఘటనపై దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు.
Similar News
News March 24, 2025
తిరుమల వెంకన్న సేవలో శిరూరు మఠం పీఠాధిపతి

ఉడుపి శ్రీ శిరూరు మఠం 31వ పీఠాధిపతి వేదవర్ధన తీర్థ స్వామిజీ తమ శిశు బృందంతో కలిసి సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహద్వారం వద్ద ఆలయ పేస్కర్ రామకృష్ణ, అర్చకులు స్వామికి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలో స్వామీజీకి తీర్థప్రసాదాలను అందజేశారు.
News March 24, 2025
గుంటూరు CID కార్యాలయానికి పోసాని

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ గుంటూరులోని CID ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల బెయిల్ ఇచ్చిన సమయంలో సీఐడీ కేసుకు సంబంధించి వారంలో 2 రోజులు కార్యాలయానికి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. సోమ, గురువారం కార్యాలయంలో సంతకాలు చేయాలని పేర్కొన్న విషయం తెలిసిందే. CIDతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదై రిమాండులో ఉండగా, ఒక్కొక్కటిగా బెయిల్ రావడంతో పోసాని 2 రోజుల కిందట రిలీజ్ అయ్యారు.
News March 24, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తాజా సమాచారం

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. మొత్తం 20.18 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 9.14 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే 473.03 అడుగుల వరకు నీటి నిల్వ ఉంది. కాగా 804 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, వివిధ అవసరాల ప్రాజెక్ట్ నుండి1485 క్యూసెక్కుల ని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.