News February 25, 2026
లైసెన్సుల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దు: DTO

లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సుల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు సూచించారు. అమలాపురం రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు నేరుగా కార్యాలయాననికి రావాలని కోరారు. పరివాహన్ వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఎంవీఐ సమక్షంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లైసెన్స్ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తున్నామని స్పష్టం చేశారు.
Similar News
News April 12, 2026
NZB: ఇంటర్ రిజల్ట్స్‌లో బాలికలదే ఆధిపత్యం

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ కోర్సుల్లోనూ గర్ల్స్ ఆధిపత్యం చాటారు. జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొత్తం 13,876 మంది రాయగా, అందులో బాలికలు 7,606కు గాను 5,828 (76.56శాతం) మంది పాస్ అయ్యారు. ఓకేషనల్ కు సంబంధించి 1,002 మంది బాలికలు పరీక్షలు రాయగ 843 (84.13 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.
News April 12, 2026
VJA: శిరిడీ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్!

మచిలీపట్నం-సాయినగర్ శిరిడీ (17208) రైలు మార్గంలో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా మే 5న ఈ రైలును విజయవాడ-ఖాజీపేట మార్గానికి బదులుగా, విజయవాడ-గుంటూరు మీదుగా దారి మళ్లించారు. దీనివల్ల ఖమ్మం, వరంగల్, ఖాజీపేట సహా పలు ప్రధాన స్టేషన్లలో ఆ రోజు రైలు నిలవదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
News April 12, 2026
ఇంటర్ రిజల్ట్స్.. ఉమ్మడి ADB ర్యాంకులు ఇవే

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మిశ్రమ ఫలితాలను కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ర్యాంకుల్లో ఆసిఫాబాద్ జిల్లా 82.16% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 3వ స్థానాన్ని కైవసం చేసుకొని సత్తా చాటింది. మరోవైపు నిర్మల్ జిల్లా 73.43% (13వ ర్యాంకు), మంచిర్యాల 71.63% (19వ ర్యాంకు) సాధించగా, ఆదిలాబాద్ జిల్లా 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానానికి పరిమితమైంది.


