News February 25, 2026

లొంగు‘బాట’లో గణపతి!

image

TG: మావోయిస్టు అగ్రనేత గణపతి(ముప్పాళ్ల లక్ష్మణరావు) కూడా లొంగు‘బాట’లో ఉన్నట్లు సమాచారం. నేపాల్‌లో తలదాచుకుంటున్న ఆయన TG పోలీసుల ముందు లొంగిపోయేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బలగాలకు అప్పగించొద్దని ఆయన షరతు పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో నేపాల్‌లో చికిత్సపొందుతున్న గణపతి ఆరోగ్యంపై క్లారిటీ రాగానే లొంగుబాటును ప్రకటించే అవకాశముందంటున్నాయి.

Similar News

News April 16, 2026

LIC HFLలో 180 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 16, 2026

సుప్రీంకోర్టుకు చేరిన TCS మతమార్పిడి కేసు

image

TCS నాసిక్‌లో జరిగిన మతమార్పిడి <<19633913>>కుట్రను<<>> ఉగ్రవాద చర్యగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ కేసు వేశారు. ఈ కుట్రలతో ప్రజాస్వామ్యం, సామరస్యం, స్వేచ్ఛతో పాటు దేశ సమైక్యత, గౌరవానికీ ముప్పేనని తెలిపారు. దీనిని తీవ్రవాద చర్యగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.