News June 30, 2024

లోకేశ్వరం: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పొలీసులు వివరాల ప్రకారం.. సేవాలాల్ తండాకు చెందిన పవార్ కృష్ణ (28) మద్యానికి బానిసై అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పవర్ అశ్విని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ASI దిగంబర్ తెలిపారు.

Similar News

News November 10, 2025

ఆదిలాబాద్: PGలో స్పాట్ అడ్మిషన్లు

image

ADB పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, పీజీ కోఆర్డినేటర్ డా. రాజ్ కుమార్ తెలిపారు. తుది విడత పీజీ అడ్మిషన్లలో బోటనీలో 40, జువాలజీలో 56 అడ్మిషన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్‌లో సీటు వచ్చిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని పేర్కొన్నారు.

News November 10, 2025

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కార్యదర్శిగా ఆదిలాబాద్ వాసికి చోటు

image

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కార్యదర్శిగా ఆదిలాబాద్ మాజీ కౌన్సిలర్, బీజేపీ ఫ్లోర్ లిడర్ బండారి సతీష్‌కు చోటు లభించింది. రాష్ట్ర కార్యవర్గం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం, సంక్షేమం కోసం కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు డా.చీమ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాకాల రామచందర్ బండారి సతీష్‌ను ఆదేశించారు.

News November 10, 2025

ఆదిలాబాద్: పత్తి, సోయా కొనుగోలు పరిమితిని పెంచాలి

image

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పత్తి, సోయా కొనుగోళ్ల పరిమితిని పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల్ శంకర్ కోరారు. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్‌కు వినతిపత్రం అందజేశారు. సోయా ఎకరాకు 6 నుంచి 7.60 క్వింటాళ్లు, సీసీఐ ద్వారా పత్తిని ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేయాలని కోరారు.