News October 5, 2024
లోకేశ్వరం: విష జ్వరంతో మహిళ మృతి

విష జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం లోకేశ్వరం మండల కేంద్రంలో
చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని లోకేశ్వరం గ్రామానికి చెందిన సిరిపెల్లి గంగామణి 34 జ్వరంతో బాధపడుతూ
లోకేశ్వరంలో డాక్టర్ను సంప్రదించిన నయం కాకపోవడంతో నిర్మల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News October 28, 2025
నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలి: ADB కలెక్టర్

జిల్లాలో నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో నమోదైన నవజాత శిశు మరణాలపై సమగ్రంగా విశ్లేషణ చేయాలని సూచించారు.
News October 28, 2025
ఆదిలాబాద్: ఏజెన్సీ సర్టిఫికెట్ల మాఫియా బహిర్గతం: ASU

ఫేక్ ఏజెన్సీ సర్టిఫికెట్తో ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొట్టిన లంబాడ తెగ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ ASU జిల్లా కార్యదర్శి సిడాం శంభు డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ రిజర్వేషన్ హక్కులపై కత్తి లాంటి దెబ్బగా మారిన ఫేక్ ఏజెన్సీ సర్టిఫికెట్ల మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్నూర్ మండలానికి చెందిన జాదవ్ నికేశ్ కేసు ఇందుకు నిదర్శనమన్నారు.
News October 28, 2025
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలి: ఆదిలాబాద్ కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(CMR) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎంఆర్ సరఫరా పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్నబియ్యం మిల్లింగ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు.


