News November 12, 2024

లోకేశ్వరం: సమగ్ర సర్వేని బహిష్కరించిన ధర్మోరా గ్రామస్థులు

image

వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామస్థులు మంగళవారం సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమగ్ర సర్వేకు సహకరించమని చెప్పారు.

Similar News

News November 15, 2024

ADB: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్ర‌జా పాల‌న సంబ‌రాలు

image

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కే.ఆర్.కే కాల‌నీలో ప్ర‌జా పాల‌న సంవత్సర సంబ‌రాల‌ను గురువారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న ఇంటింటి కుటుంబ స‌ర్వేను విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌జ‌లు సైతం స‌హ‌క‌రించాల‌ని ఆయన కోరారు.

News November 15, 2024

ADB: గ్రూప్-4 ఫలితాల్లో ఆదివాసీ యువకుడి సత్తా

image

TGPSC విడుదల చేసిన గ్రూప్ -4 ఫలితాల్లో అదివాసీ యువకుడు సత్తాచాటారు. ADB జిల్లా సిరికొండ మండలం రాయిగూడ గ్రామానికి చెందిన మడావి నాగోరావ్ జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారు. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం పని చేస్తూ గ్రూప్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల కుటుంబీకులు మిత్రులు అభినందలు తెలిపారు.

News November 14, 2024

కాసిపేట మండలాన్ని విడిచి వెళ్లిన పెద్దపులి

image

మంచిర్యాల జిల్లా కాసీపేట మండలం ముత్యంపల్లి సెక్షన్ పరిధిలోని పెద్దధర్మారం, గురువాపూర్, చింతగూడ, మలికేపల్లి, వెంకటాపూర్ శివారులో గత 10రోజులుగా సంచరించిన పెద్దపులి తీర్యాని అడవుల్లోకి తరలి వెళ్లినట్లుగా అటవి శాఖ అధికారులు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ..తీర్యాని మండలం ఏదులాపూర్ అటవీ శివారులో పులి పాద ముద్రలను అక్కడి అధికారులు కనుగొన్నట్లు వివరించారు.