News November 12, 2024

లోకేశ్వరం: సమగ్ర సర్వేని బహిష్కరించిన ధర్మోరా గ్రామస్థులు

image

వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామస్థులు మంగళవారం సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమగ్ర సర్వేకు సహకరించమని చెప్పారు.

Similar News

News December 10, 2024

తాండూరు: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

image

కుటుంబసభ్యులంతా ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన తాండూరు మండలంలోని కాసిపేట గ్రామంలో జరిగింది. మొండయ్య(60), శ్రీదేవి(50) దంపతులు, వారి కుమార్తె చిట్టి(30), కుమారుడు శివప్రసాద్ (26) ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగు మందు తాగారు. కాగా వారిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News December 10, 2024

నిర్మల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి సూసైడ్

image

నిర్మల్‌కు చెందిన ఓ ఉద్యోగి భరత్ సోమవారం ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. కాగా చనిపోయే ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. ‘2018లో ఆరోగ్య శాఖలో RNTCP కాంట్రాక్ట్ ఉద్యోగం పొందాను. నాకంటే కింది స్థాయి వారికి ఎక్కువ జీతం రావడం.. నేను పర్మినెంట్ కాకుండా ఉంటానేమోనని మనస్తాపానికి గురై చనిపోతున్నా. నాభార్య పల్లవికి అన్యాయం చేస్తున్నా. కుమారుడు దేవాను వీడిపోతున్నా, అమ్మనాన్న సారీ’ అంటూ నోట్ రాశాడు. 

News December 10, 2024

నిర్మల్: తండ్రిని కొట్టి, ఉరేసి చంపిన కొడుకు

image

తండ్రిని కొడుకు చంపిన ఘటన నిర్మల్‌లో జరిగింది. SI లింబాద్రి వివరాల ప్రకారం.. ముఠాపూర్‌కు చెందిన ముత్యం(47) ఆదివారం రాత్రి తన తల్లిని మద్యం కోసం డబ్బులివ్వాలని కొట్టాడు. అప్పుడే ఇంటికి వచ్చిన ముత్యం కొడుకు మణిదీప్ నానమ్మను కొట్టాడనే కోపంతో తండ్రిని చితకబాదాడు. కోపం తగ్గకపోవడంతో చీరతో ఉరేసి చంపాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వృద్ధురాలిని ఆరాతీయడంతో విషయం బయటపడినట్లు SI వెల్లడించారు.